నందమూరి ఫ్యామిలీలో అకాల మరణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ మరణాలు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ ను సైతం ఎంతగానో బాధ పెడుతున్నాయి.
ప్రముఖ వాస్తు నిపుణులలో ఒకరైన నానాజీ పట్నాయక్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ నందమూరి కుటుంబ సభ్యుల మరణాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
యాక్సిడెంట్ల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, ఆత్మహత్యల వల్ల నందమూరి కుటుంబ సభ్యులు మృతి చెందుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
వాళ్ల వంశంలో ఏదైనా శాపం ఉన్నా జాతకంలో అకాల మరణం ఉన్నా ఈ విధంగా జరుగుతుందని ఆయన కామెంట్లు చేశారు.కొన్నిరోజుల క్రితం 37 ఏళ్ల వయస్సులో ఒక వ్యక్తి కాళ్లు చేతులు వంకర పోయి చనిపోయాడని నానాజీ పట్నాయక్ తెలిపారు.

చిన్నప్పుడే జాతకం చూసిన సమయంలో గండాలు తెలుస్తాయని ఆయన కామెంట్లు చేశారు.మరణాన్ని ప్రెడిక్ట్ చేయడం సులువు కాదని నానాజీ పట్నాయక్ అన్నారు.నిత్యమ దీపారాధన చేయడం ద్వారా అకాల మరణాలను జయించవచ్చని ఆయన తెలిపారు.టెంపుల్స్ లోని తీర్థంలో ఆయుర్వేదానికి సంబంధించినవి కలుస్తాయని నానాజీ పట్నాయక్ వెల్లడించారు.

ప్రతిరోజూ తల్లీదండ్రులకు నమస్కరించాలని ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.నందమూరి కుటుంబ సభ్యులు జ్యోతిష్కుల సూచనల మేరకు పరిహారాలు చేసుకుంటే మంచిది.నైరుతికి వీధిపోట్లు ఉన్నా ఈ తరహా ఘటనలు జరుగుతాయని సమాచారం అందుతోంది.నైరుతిలో గొయ్యి తవ్వి ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఉన్నారని అది పడమర నైరుతి అయితే సమస్య లేదని ఆయన కామెంట్లు చేశారు.
తెలిసో తెలియకో చేసిన తప్పు వల్ల కూడా ఇలాంటి అకాల మరణాలు సంభవించే అవకాశాలు అయితే ఉంటాయని నానాజీ పట్నాయక్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.ఏదైనా శివాలయాన్ని బాగు చేస్తే ఈ దోషాలు పోతాయని ఆయన తెలిపారు.







