టైం ట్రావెలింగ్ గురించి మనిషి అనాదిగా వింటూనే వున్నాడు.ఇది సాధ్యమో, అసాధ్యమో అనే విషయం పక్కనబెడితే దీనిగురించి కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి.
ఇక 90sలో బాలయ్య టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో “ఆదిత్య 369” సినిమా తీసి హిట్టు కొట్టాడు.అందులో గతంలోకి మాత్రమే కాకుండా భవిష్యత్తుకూ వెళ్ళి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఏకంగా చూపిస్తారు.
అయితే రియల్ గా ఈ టైం ట్రావెలింగ్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనేక విషయాలు చెబుతున్నా పెద్దగా వాటికి ఆధారాలు అనేవి లేవు.కానీ ఒక వ్యక్తి మాత్రం తాను 2858 సంవత్సరం వరకు ప్రయాణం చేశానని చెప్పడం కొసమెరుపు.
అదంతా ఓకే గాని, ఇపుడు అతగాడు భవిష్యత్ గురించి కొన్ని రకాల విషయాలు చెప్పి జనాలను టెన్షన్ పెడుతున్నాడు.ముఖ్యంగా ఈ ఏడాది ఈ 5 పెద్ద ఘటనలు జరగబోతున్నాయని డేట్స్ తో సహా చెప్పి షాకిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఇదంతా ఫేక్ అని అందరూ ఇతని మాటను కొట్టి పారేస్తుండటంతో ఇతను మరొక అడుగు ముందుకు వేసి 5 ముఖ్యమైన తేదీలు చెప్పి ఆ తేదీలలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు.ఫిబ్రవరి 28, 2023లో గ్రహాంతర వాసులు ఏదో ఒక రూపంలో భూమిపైకి వస్తారని ఇతను చెప్పాడు.
ఆ తరువాత ఏప్రిల్ 2, 2023 తేదీన శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయాన్ని కనుక్కుంటారని చెప్పి షాక్ ఇచ్చాడు.
అదే విధంగా మే4, 2023న అంగారక గ్రహంపైన ఎముకల కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయట.ఈ ఎముకల కుప్పల ఆధారంగా మానవులు అంగారక గ్రహానికి చెందినవాళ్ళనే విషయం బయటపడుతుందని చెప్పుకొచ్చాడు.అలాగే ఆగష్టు 26, 2023 1.5మిలియన్ సంవత్సరాల కిందట కనుగొనబడిన మెగాలోడాన్ సొరచేపలు మరియానా ట్రెంచ్ దిగువ ప్రాంతంలోమళ్ళీ కనబడతాయని అన్నాడు.చివరగా అక్టోబర్ 16, 2023న కొంతమంది యువకులకు పురాతన శిథిలాలలో ఒక రాయి లభిస్తుందట.
అదే రాయి సహాయంతో టైం ట్రావెల్ సాధ్యమవుతుందట.ఇలా 5 ముఖ్యమైన విషయాలు చెప్పి ఇవన్నీ నిజమవుతాయని అతను చెప్పగా కొందరు నెటిజన్లు ఇదంతా ఫేక్ అంటుంటే మరికొందరు మాత్రం అతగాడికి మద్దతు ఇస్తున్నారు.