ఏపీలో టీడీపీ జనసేన మద్య పొత్తు వ్యవహారం ఎప్పుడు కూడా హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతూ ఉంటుంది.2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా కలిసి ఒక కూటమిగా పోటీచేశాయి.ఆ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది.అయితే ఆ విజయంలో పవన్ ది కీ రోల్ అని చెప్పవచ్చు.పవన్ చేసిన క్యాంపైన్ టీడీపీకీ బాగా హెల్ప్ అయింది.దాంతో టీడీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే 2019 ఎన్నికల్లో మాత్రం ఎవరికివారే అన్నట్లుగా పోటీచేసి చేతులు కాల్చుకున్నారు.

ఓట్ల చీలికతో వైసీపీ అధిక సీట్లు సొంతం చేసుకొని ఏకంగా 151 స్థానాల్లో విజయం గెలుపొంది కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈసారి 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీని గెలవనిచ్చే ప్రసక్తే లేదంటూ అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు కూడా జబ్బలు చరుస్తున్నాయి.దాంతో అటు చంద్రబాబు ఇటు పవన్ ఇద్దరి టార్గెట్ జగన్ ను గద్దె దించడమే కాబట్టి టీడీపీ, జనసేన మద్య పొత్తు ఉందని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తుంటారు.
అయితే పవన్, చంద్రబాబు తరచూ భేటీ కావడం కూడా ఇరు పార్టీల మద్య పొత్తు ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.కానీ పొత్తు పై అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని అధికారికంగా ప్రకటించలేదు.
అయినప్పటికీ ఎన్నికల సమయానికి ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.ఇక ఇటీవల బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణ ఈ రెండూ పార్టీల పొత్తుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ జనసేన కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇరు పార్టీల అధినేతలు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని కన్నా సూచించారు.అయితే కన్నా వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమే అనే అభిప్రాయం కలుగకమానదు.ఇక కన్నా టీడీపీ కండువా కప్పుకోవడానికి కూడా.పవన్ సూచనలే కారణం అనే వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇరు పార్టీల మద్య పొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే మొదట జనసేనలో చేరాలని భావించినప్పటికి.కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరరాని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ రెండూ పార్టీల మద్య పొత్తును ప్రజలు కోరుకుంటున్నారో లేదో తెలియదు గాని,.టీడీపీ నేతలు మాత్రం జనసేనతో కలవాలని అమితంగా కోరుకుంటున్నాట్లు తెలుస్తోంది.
మరి ఈ రెండూ పార్టీలు పొత్తు అంశాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాయో చూడాలి.







