నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖ నటి.. వీడియో వైరల్?

ప్రముఖ మలయాళ నటి, యాంకర్, కమెడియన్ సుభి సురేష్ తాజాగా మరణించిన విషయం తెలిసిందే.సుబి సురేష్ మరణంతో ఒక్కసారిగా మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

 Subi Suresh Shared About Her Health Issues And Reasons Behind Them Old Video, Su-TeluguStop.com

గత కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తాజాగా తుది శ్వాస విడిచింది.అయితే ఆమె మరణాన్ని అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఆమె సమయానికి తినకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అలా అనారోగ్యానికి గురి అయినట్టుగా తెలుస్తోంది.

Telugu Subhi Suresh, Mollywood, Subi Suresh-Movie

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆరు నెలల క్రితం తన ఆరోగ్యం గురించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో సుబి సురేష్ మాట్లాడుతూ.సమయానికి తినడం, మందులు వేసుకోవడం లాంటి మంచి అలవాటు నాకు లేదు.

అందుకే ఒకసారి షూటింగ్ ముందు రోజు చాతిలో నొప్పి వచ్చింది.దానికి తోడు గ్యాస్టిక్ సమస్య కూడా తోడైంది.

ఆ మరుసటి రోజు నేను ఏదీ తినలేకపోయాను.ఒకటే వాంతులు కొబ్బరి నీళ్లు తాగినా కూడా దాన్ని బయటకు కక్కేసాను.

అలా నేను రెండు రోజులపాటు నేను ఏమి తినలేదు.అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పొటాషియం చాలా తక్కువగా ఉంది సరిగా తినాలని సూచించారు.

Telugu Subhi Suresh, Mollywood, Subi Suresh-Movie

చాలామంది నాకు డబ్బు పిచ్చి అనుకుంటారు.ఆహారం కూడా తినకుండా డబ్బు వెంట పరిగెడుతుందని అనుకుంటూ ఉంటారు.కానీ అదంతా కూడా వారి భ్రమ.ఎందుకంటే చాలా కాలం తర్వాత వరుసగా ప్రాజెక్టులు అవకాశాలు రావడంతో ఉత్సాహంతో వాటిని పూర్తి చేసుకుంటూ పోయాను.ఫోకస్ అంతా కూడా డబ్బు మీద కాకుండా పని మీదే ఉంది.ఆ సమయంలోనే ఫుడ్ తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాను.

ఇదే విషయంలో మా సోదరుడు అమ్మాయి ఇద్దరు నన్ను తిట్టేవారు.నాకు ఎంతో ఇష్టమైనవి కూడా తీసుకువచ్చినా నేను కన్నెత్తి కూడా వాటి వైపు చూసే దాన్ని కాదు.

చెప్పాలంటే నాకు ఆకలిగా ఉన్నా కూడా ఏమి తినలేక పోయేదాన్ని.అదే నాకున్న అత్యంత చెడ్డ లక్షణం అని ఆమె చెప్పుకొచ్చింది.

డాక్టర్ చెప్పినట్లు అమ్మ వాళ్ళు చెప్పినట్టు ముందు నుంచి కరెక్ట్ గా తిని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.షూటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా బెడ్ రూమ్ కి పడుకునేదాన్ని అప్పుడు కూడా బద్దకంగా నీళ్లు తాగి పడుకునే దాన్ని అందుకే నాకు ఈ సమస్య వచ్చింది అని ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube