ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన స్నిగ్ధ మాట్లాడుతూ నేను ఒకే ఒక్క కూతురునని తెలిపారు.తల్లీదండ్రులు గారాబం చేశారని ఏం లేదని వాళ్లతో మంచి ర్యాపో ఉందని స్నిగ్ధ పేర్కొన్నారు.
నేను, నా తల్లీదండ్రులు ఫ్రెండ్స్ లా ఉంటామని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అలాంటి సందర్భం వస్తే కళ్యాణం జరుగుతుందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
సంవత్సరంలో 120 రోజులు నేను దీక్షలోనే ఉంటానని స్నిగ్ధ అన్నారు.
మనకు కూడా ఒక సంసారం ఉండాలి అలాంటి గోల్స్ అయితే లేవని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.
ఒక పిల్లను కలిసి ఆ పిల్ల చుట్టూ జీవితం అని భావించకూడదని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.నేను కాలేజ్ దాటే వరకు కూడా క్యాస్ట్ అంటే ఏంటో తెలియదని స్నిగ్ధ తెలిపారు.
ఎవరైనా కులం గురించి అడిగితే నేను ఇండియన్ అని చెప్పుకునేదానినని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.కులం అంత ముఖ్యం కాదని నాకు అనిపించిందని ఆమె తెలిపారు.

పర్సనాలిటీ ట్రేడ్స్ ను క్యాస్ట్ డిఫైన్ చేయదని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.ప్రతి క్యాస్ట్ లో మంచోళ్లు, చెడ్డోళ్లు ఉంటారని కులం గురించి పట్టించుకోనని ఆమె తెలిపారు.నేను రెబల్ అని అవసరమైతే ఇచ్చిపడేస్తా అని స్నిగ్ధ పేర్కొన్నారు.చిన్నప్పుడు పోనీ టెయిల్ ఉండేదని ఆమె తెలిపారు.నాతో పెళ్లి అడిగిన వాళ్లకు జీవితం మీద ఆశ లేదా అని అడిగానని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.

పిల్లలను కరెక్ట్ గా పెంచితే వాళ్లు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా తయారవుతారని ఆమె తెలిపారు.నేను చీరలు పర్ఫెక్ట్ గా కడతానని ఆమె అన్నారు.ఎవరినైనా ఇష్టపడ్డావా అని పేరెంట్స్ అడిగారని స్నిగ్ధ తెలిపారు.
మన ప్రవర్తన పెంపకంపై ఆధారపడి ఉంటుందని ఆ ఫ్రీడమ్ మా పేరెంట్స్ నుంచి దొరికిందని ఆమె కామెంట్లు చేశారు.







