వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ప్రీతి కేసు విచారణను పోలీస్ శాఖ వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ప్రీతి సూసైడ్ ఎటెంప్ట్ కేసుపై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెప్పే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.ఎక్మో, వెంటిలేటర్ పై ప్రీతికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
బాధితురాలి గుండె, కిడ్నీ పనితీరు మెరుగుపడిందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.







