టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో అని కన్ఫర్మ్ అయింది.బాహుబలి తర్వాత మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు బిజీగా ఉండి రాజమౌళి తో సినిమా చేయలేక పోయాడు.ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొంది ఇప్పటికే స్టోరీ రెడీ అవుతుందని సమాచారం అందుతుంది.
రాజమౌళి అన్ని సినిమాలకు కూడా కథ ను అందించే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కు కథ ను రెడీ చేస్తున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తో రాజమౌళి ఒక అడ్వంచర్ కథా చిత్రం చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
ఇక మొన్నటి వరకు 2023 సంవత్సరం లోనే మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి, కానీ ఈ సంవత్సరం కనీసం అధికారిక ప్రకటన కూడా వచ్చే దాఖలాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఈ ఏడాదికి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ నిర్వహించి.వచ్చే సంవత్సరం ఆరంభం నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.2024 లో పూర్తి స్థాయి షూటింగ్ పూర్తి చేసి 2025లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.జక్కన్న కచ్చితంగా రెండు సంవత్సరాలు మేకింగ్ కి తీసుకుంటాడు.కనుక 2025 సంవత్సరం లో సినిమా వస్తుందా అంటే అనుమానమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సినిమా ను సంవత్సరాలకు సంవత్సరాలు సమయం తీసుకుంటే కష్టమవుతుంది కదా అనే ఉద్దేశం తో మహేష్ బాబు సినిమాకు కాస్త స్పీడ్ గా జక్కన్న చేసే ఉద్దేశం తో ఉన్నాడట.అందుకే 2025 సంవత్సరం లో మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.







