వరంగల్ లో ఎంజీఎం సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలిసిందే.ఈ ఘటనలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతికీ హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఉంది.
ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.అవయవాలు బాగా దెబ్బ తినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
పరిస్థితి ఇలా ఉంటే ఈ కేసులో పోలీసులు విచారణ మూమ్మరం చేశారు.దీనిలో భాగంగా ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం సీనియర్ వైద్యుడు సైఫ్ అని ఆరోపణలు రావటంతో అతని వాట్సాప్ చాట్ రిట్రీవ్ చేయడం జరిగింది.
ఇదే సమయంలో ప్రీతి వాట్సాప్ కూడా పరిశీలన చేయడం జరిగింది.దీనిలో భాగంగా గత కొంతకాలంగా ప్రీతిని సైఫ్ వేధించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
ప్రీతిని అవమానించే విధంగా వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు గుర్తించడం జరిగింది.దీంతో వరంగల్ పోలీసులు సైఫ్ నీ కస్టడీలోకి తీసుకున్నారు.సైఫ్ పై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.ప్రీతి తండ్రి సీనియర్ వేధింపులు వళ్లనే తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో వాట్సాప్ చాట్ లో… ప్రీతి గదిలో కీలక సమాచారం లభించడంతో… ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ సైఫ్ కారణమని.అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.వరంగల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.