ఇండస్ట్రీ కి మొదట రైటర్ గా వచ్చి ఆ తర్వాత డైరెక్టర్ అయిన వాళ్ళల్లో కె ఎస్ రవీంద్ర (బాబీ) ఒకరు.ఈయన శ్రీహరి హీరోగా మల్లికార్జున్ డైరెక్టర్ గా వచ్చిన భద్రాద్రి సినిమాకి కథ అందించాడు.
ఒక మంచి పాయింట్ తో ఈ సినిమా స్టోరీ సాగుతుంది అయినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ప్లాప్ అయింది.ఈ సినిమా తర్వాత చాలా రోజుల పాటు కోన వెంకట్ గారి టీం లో జాయిన్ అయిపోయి ఆయన దగ్గర వర్క్ చేసారు.ఆయన దగ్గర ఉన్నప్పుడు డాన్ శీను,బాడీగార్డ్ లాంటి సినిమాలకి స్టోరీ లోగాని, స్క్రీన్ ప్లే లోగాని తన వంతు పాత్ర పోషిస్తూ తనకి తోచిన సలహాలు ఇస్తూ ఉండేవాడు…

అయితే రవి తేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన బలుపు సినిమాకి కథ అందించారు.ఈ సినిమా మంచి విజయం అందుకుంది ఆ వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ వి వి వినాయక్ తీసిన అల్లుడు శీను సినిమాకి కథ అందించాడు.ఈ సినిమా కూడా యావరేజ్ గా ఆడింది.

ఇక దాని తర్వాత రవితేజ హీరోగా పవర్ అనే సినిమాకి డైరెక్షన్ చేసాడు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం వచ్చింది ఈ సినిమా డిజాస్టర్ అయింది.అయిన కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా మళ్లీ ఒక మంచి రాసుకొని ఎన్టీయార్ ని పెట్టి జై లవకుశ సినిమా తీసాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీసెంట్ గా చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు…
.







