తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నలే చేస్తోంది.గతంతో పోలిస్తే ప్రస్తుతం పార్టీకి బలం బాగా పెరిగిపోవడంతో ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని కమలం పార్టీ గట్టిగానే భావిస్తోంది.
అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్నారు కమలనాథులు.ఇప్పటికే ఆయా సర్వేలు కూడా బిఆర్‌ఎస్ తరువాతి స్థానాన్ని బీజేపీకి కట్టబెడుతున్నాయి.
దీంతో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే విధంగా బిఆర్‌ఎస్ నేతలపైనా, కేసిఆర్ పాలనలోని లోటు పాట్ల పైన విమర్శనస్త్రాలు ఎక్కుబెడుతూ ప్రజల దృష్టి తమపై పడేలా చూసుకుంటున్నారు కమలనాథులు.

ఇంతవరుకు బాగానే ఉన్నప్పటికి ఆయా సందర్భాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానాన్నికి తలనొప్పిగా మారాయి.హిందూ మతాన్ని మాత్రమే హైలెట్ చేయడం, ఆయన చేసే సెంట్ మెంట్ వ్యాఖ్యలు ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపకపోవడం.అమిత్ షా కాళ్ళకు చెప్పులు తొడగడం వంటి పరిణామాలతో సోషల్ మీడియాలో బండి సంజయ్ పై నెగిటివిటీ కాస్త ఎక్కువగానే ఏర్పడింది దీంతో ఆయన విషయంలో బీజేపీ అధిష్టానం ఎటు తేల్చుకోలేక పోతుందట.
ఆద్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఆ పదవిని ఈటెల రాజేందర్ కు ఇవ్వబోతున్నట్లు ఆ మద్య వార్తలు కూడా గుప్పుమన్నాయి.

అయితే ఈ సారి ఎన్నికల వరకు బండి సంజయ్ నే కొనసాగించాలని అధిస్థానం భావిస్తోందట.ఎందుకంటే ప్రస్తుతం బండి సంజయ్ పై ఉన్న నెగిటివిటీ కాస్త పక్కన పెడితే.ఆయన అధ్యక్ష బాద్యతలు చేపట్టిన తరువాతనే తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంది.
ఈ తరుణంలో అద్యక్ష పదవిని మార్చే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ఐదు విడతల్లో పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్.
ఆరో విడతకు కూడా సిద్దమౌతున్నారు.ఈ బండి పాదయాత్రతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారు.
మరి వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ బీజేపీకి బలం అవుతారో లేదా బలహీనం అవుతారో చూడాలి.







