హీరోయిన్ గా అడుగు పెట్టాలంటే అందంతో పాటు నటన, ఇతర టాలెంట్ కూడా ఉండాలి.ఏ ఒకటి లేకున్నా హీరోయిన్గా కొనసాగటం కష్టం.
అందుకే టాలెంట్, నటన ఉండి అందం లేకున్నా కూడా ఫేస్ సర్జరీలు చేయించుకొని మరి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.కొందరు హీరోయిన్లు అందంగా ఉన్న నటన లేకపోవడంతో వాళ్లను పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు.
ఇక నటన ఉండి అందంగా లేకున్నా కూడా ఎంతో కొంత అవకాశాలు అందుకుంటున్నారు.అందులో ఒకరు పూజ హెగ్డే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి.ఈమె తొలిసారిగా 2010 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆ తరువాత వరుస సినిమాలలో వెను తిరిగి చూడకుండా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.
అలా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

ఈమధ్య వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా దూసుకుపోతుంది.కానీ ఎటువంటి లాభం లేకపోయింది.ఒకప్పుడు పూజ హెగ్డే అంటే టాలీవుడ్ దర్శక నిర్మాతలు బాగా సెంటిమెంటుగా భావించేవాళ్ళు.
ముందుగానే తన డేట్స్ కోసం బాగా ఎగబడేవారు.తనకు డేట్స్ లేకున్నా కూడా తనకోసం ఎదురు చూసేవాళ్ళు.
కానీ ఇప్పుడు అలా లేదు.ఇప్పుడు ఈమెకు అవకాశాలు రావడమే చాలా కష్టంగా ఉంది.
ఎందుకంటే ఆ మధ్య ఈమె నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.దీంతో అప్పటినుంచి ఈమెకు ఐరన్ లెగ్ అంటూ ముద్ర కూడా వచ్చింది.
పైగా అభిమానించిన ప్రేక్షకులే ఈమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.మొదట్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీకి నటనపరంగా మంచి టాలెంట్ ఉన్న కూడా ఇప్పుడు ఎందుకు అంతగా సక్సెస్ కాలేక పోతుంది.

చూడ్డానికి కూడా అంత అందంగా అనిపించదు.ఏదో మేకప్ వల్ల ఈమె కాస్త అందంగా కనిపిస్తుంది తప్ప.మేకప్ లేకుండా చూడటం చాలా కష్టమని చెప్పాలి.ఇక ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అభిమానులతో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.
మరింత ఫిజిక్ కోసం బాగా ప్రయత్నిస్తుంది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ బిజీగా మారింది.
ఇక తను వర్క్ అవుట్ లు చేస్తున్న ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అయినా కూడా ఈమెకు మాత్రం బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
అయితే సోషల్ మీడియాలో తాజాగా ఈమె పై మరో దారుణమైన ట్రోల్ ఎదురైంది.ఈమెలో నటన ఒక్కటి లేకుంటే.
ఈమె ముఖం కూడా డైరెక్టర్ చూసేవారు కాదు అంటూ. కనీసం టీ కాఫీలు మోయడానికి కూడా పనికిరాదు అంటూ దారుణంగా కామెంట్ చేశారు.
పాపం.ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పాలి.







