అనన్య పాండేకి తెలుగు సినిమా చేతికి అంది చేజారింది పాపం..!

బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే కెరీర్ ఆరంభం లోనే వరుసగా ఆఫర్స్ సొంతం చేసుకుంది.అయితే గుర్తింపు వస్తుందని ఎదురు చూస్తున్న సమయం లో పాపం కరోనా కారణంగా ఆఫర్లు మిస్ అయ్యాయి.

 Liger Heroine Ananya Panday Loss Tollywood Offer,ananya Pandey,liger Movie,bolly-TeluguStop.com

మరో వైపు విజయ్ దేవరకొండ తో నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది.దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండల పై చాలా నమ్మకం పెట్టుకున్న అనన్య పాండే కు అన్ని విధాలుగా నష్టం వాటిల్లింది.

లైగర్ సినిమా తర్వాత అనన్య పాండే వెంటనే ఒక తెలుగు సినిమాను చేసేందుకు కమిట్ అయింది.అయితే లైగర్‌ సినిమా ఫ్లాప్ అవడం తో చెప్పా పెట్టకుండా ఆ సినిమా నుండి అనన్య పాండే ను తొలగించారని సమాచారం అందుతుంది.అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేయాలంటూ ఆమె కు సందేశం ఇచ్చారట.కొద్ది మొత్తం లోనే అడ్వాన్స్ ఇచ్చారు కనుక ఆమె ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.మొత్తానికి తెలుగు లో వచ్చిన అవకాశం చేజారి పోవడం తో అనన్య పాండే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలగాలని ఆశ పడుతున్న అనన్య పాండే సౌత్‌ లో కూడా వరుసగా ఆఫర్స్ వస్తాయని ఆశించింది.కానీ వచ్చిన ఒక్క ఆఫర్ కూడా లైగర్ ఫ్లాప్ కారణంగా చేజారి పోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తుంది.బాలీవుడ్ లో మళ్లీ వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటే అప్పుడు ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

విజయ్ దేవరకొండ తో నటించినందుకు చాలా నష్టం జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.మరి కొందరు మాత్రం విజయ్ దేవరకొండ తో నటించినందుకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు అయితే లభించింది.

ముందు ముందు భారీగా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం చేస్తున్నారు.ఈ అమ్మడి యొక్క కెరీర్‌ ఎలా సాగుతుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube