కెరియర్ మొదట్లో మంచి విజయాలు అందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత కాలం లో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది.లక్ష్మి నరసింహ సినిమాతో హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు ఒక్క హిట్ కూడా అందుకోలేదు.
బోయపాటి తో చేసిన సింహ సినిమా వచ్చేదాకా బాలయ్య కి ఒక్క హిట్ కూడా దక్కలేదు.అంతకు ముందు వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు ప్లాప్ అయ్యాయి.
ఈ క్రమం లోనే ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేసిన వీరభద్ర సినిమా కూడా ప్లాప్ అయిందనే చెప్పవచ్చు.ఈ డైరెక్టర్ గోపిచంద్ తో యజ్ఞం అనే ఒక భారీ హిట్ సినిమా తీసి ఉండడం వల్ల బాలయ్య అతనికి ఒక సినిమా ఇచ్చాడు…
పెద్ద హీరో అయినా బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు గా స్టోరీ ని మారుస్తూ షూటింగ్ టైం కి కూడా సరిగా రాకుండా తాగి సెట్ కి వచ్చేవాడట దాంతో బాలకృష్ణ దాక ఈ విషయం వెళ్లడం తో ఫస్ట్ టైం బాలయ్య మందలించి వదిలేసాడట కానీ మళ్లీ అదే రిపీట్ కావడం తో బాలయ్య అతని మీద చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది…
ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినా అంబికా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ లో రవి కుమార్ చౌదరి గురించి ఇలాంటి కామెంట్లు చేసారు.ఆయన తీసిన సినిమా వల్ల తనకి చాలా నష్టం వచ్చిందని కూడా చెప్పాడు ఇలాంటి డైరెక్టర్స్ వల్ల ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని కూడా చెబుతూ తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు… అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత రవి కుమార్ చౌదరి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఆ ఆరోపణలకి వివరణ ఇచ్చారు…
.