తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే మృతి చెందిన ఘటన పై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .విశ్వ నగరంలో బాలుడు పై కుక్కలతో దాడి చేసే స్థాయికి కేసిఆర్ పాలన వచ్చిందని రేవంత్ మండపడ్డారు.ఈ సందర్భంగా నగర మేయర్, మంత్రిపైన విమర్శలు చేశారు.

కుక్కల దాడిలో బాలుడు చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా, సారీ చెప్పి చేతులు దులుపుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది అంటూ విమర్శలు చేశారు.హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుక్కలకు ఆకలి వేయడంతో చిన్నారి పై దాడి చేశాయి అనడం… కుక్కలు కరిచి మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయిస్తాము అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని , ప్రజాప్రతినిధులు ఒకటి జరిగితే మరొకటి మాట్లాడడం ఏంటని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రికి పేదల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోతుందని, టిఆర్ఎస్ పాలన కుక్కల పాలన అంటూ రేవంత్ విమర్శలు చేశారు.ఆరు సంవత్సరాల పాపను కుక్కలు పీక్కుతున్న ఘటన పై క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని, ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.బీఆర్ ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ ప్రజలను కోరారు.







