ప్రముఖ రియాలిటి షో బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ షో తెలుగులో ఆరు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఏడవ సీజన్ కి కూడా సిద్ధమవుతోంది.కాగా ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది కంటెస్టెంట్లు సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ కూడా ఒకరు.

బిగ్ బాస్ హౌస్ లో తన అందం, అభినయంతో అభిమానులను ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో తర్వాత ఈవెంట్లు టీవీ సీరియల్స్ సినిమాలు అంటూ బిజీ బిజీగా మారిపోయింది.ఇక తర్వలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో రెచ్చిపోయింది వాసంతి.లిప్ లాక్ లతో, హాట్ హాట్ రొమాంటిక్ ఫోజులతో తనను ఎప్పుడూ చూడని యాంగిల్ లో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.
కాగా వాసంతి కృష్ణన్ తాజాగా నటించిన చిత్రం గేమ్ ఆన్.విశ్వక్ సేన్ ఫ్రెండ్ గీతానంద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తాజాగా మంగళవారం రోజున విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హీరో విశ్వక్ సేన్ హాజరయ్యారు.ఇకపోతే వాసంతి విషయానికి వస్తే.ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ కాగా వాసంతి కృష్ణన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ టీజర్ లో వాసంతి సీన్స్ చూస్తుంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా నటించని విధంగా తన హాట్ నెస్ ను చూపించింది.అంతేకాకుండా లిప్ లాక్ లతో రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది.
కైపెక్కించే చూపులతో కుర్రకారుకు సవాల్ విసురుతోంది.రొమాంటిక్ సీన్లలో వాసంతిని చూసేసరికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా యాక్షన్, థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోందీ.







