అనకాపల్లి జిల్లాలోని ఎర్రవరంలో చోటు చేసుకుంటున్న హత్యలు మిస్టరీగా మారాయి.దీంతో సమీప ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఎర్రవరంలోని చెరుకుతోట సమీపంలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా గతంలో ఇదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.
ఓ మనిషిని అతి దారుణంగా నరికి పడేశారు గుర్తు తెలియని దుండగులు.వరుస హత్యలు జరుగుతుండటంతో గ్రామస్థులు భయానికి గురవుతున్నారు.







