ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన సినిమా వజ్రం.ఈ సినిమా చేసే ముందు ఎస్ వి కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం లాంటి సినిమాలతో హిట్స్ కొట్టి ఉన్నాడు.
కాబట్టి నాగార్జున పిలిచి మరి సినిమా చేద్దాం అని చెప్పి ఆయనతో సినిమా చేసాడు.అయితే ఈ సినిమాలో హీరో తో పాటు సమానమైన ఇంకో రోల్ ఉంది అది ఏంటంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ దానికి అప్పటి వరకు చేయని ఒక ఫ్రెష్ పేస్ కావాలి అని డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి వెతుకుతున్నప్పుడు ఆయనకి కె విశ్వనాధ్ గారు కనిపించారు…

దాంతో ఆ క్యారెక్టర్ ఆయన తో చేయిద్దాం అని ఫిక్స్ అయిన కృష్ణ రెడ్డి గారు విశ్వనాధ్ గారిని కలిసి ఆయనకి కథ చెప్పి ఆయన్ని తండ్రి క్యారెక్టర్ చేయమంటే నేను చేయను అని చెప్పారట ఎందుకంటే తనకి యాక్టింగ్ చేయడం పెద్దగా ఇష్టం లేదట సినిమాలు డైరెక్షన్ చేయడం అంటేనే తనకి చాలా ఇష్టం మళ్లీ యాక్టింగ్ సైడ్ వెళ్తే డైరెక్షన్ ఆగిపోతుందేమో అనుకొని నేను చేయలేను అని ఎంత చెప్పిన ఎస్ వి కృష్ణారెడ్డి అండ్ టీం వినకపోయేసరికి విశ్వనాథ్ గారు తప్పించుకోవడానికి ఈ క్యారెక్టర్ నేను చేయాలంటే నాకు భారీ రెమ్యునరేషన్ కావాలి అని

ఒక 20 లక్షల రెమ్యునరేషన్ అడిగారట అయిన సరే ఇస్తాం అని ఆ సినిమా ప్రొడ్యూసర్స్ చెప్పారట దానికి షాక్ అయిన విశ్వనాథ్ గారు మళ్ళి చేయను ఊరికే అలా చెప్పాను అని చెప్పిన కూడా ప్రొడ్యూసర్స్ ఆయన చెప్పిన డబ్బులు ఇచ్చి మరి ఆయనతో ఆ క్యారెక్టర్ చేయించారు.అప్పుడు అది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి…అన్ని డబ్బులు పెట్టిన కూడా ఆ సినిమా బాక్సఫీస్ వద్ద ప్లాప్ అయింది కానీ విశ్వనాధ్ గారి పాత్రకి మంచి పేరు వచ్చింది.దాంతో అప్పటి నుండి ఆయన యాక్టింగ్ కూడా చేస్తూ వచ్చారు…
.







