బాలీవుడ్ బాద్షా ఇప్పుడు నిజంగానే బాద్షా అనిపించు కుంటున్నాడు.అందుకు కారణం పఠాన్ సినిమా అనే చెప్పాలి.
యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.
పఠాన్ సినిమా జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ సైతం రాబడుతుంది.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.తాజాగా పఠాన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లను రాబట్టింది అనేది మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.మేజర్ గా హిందీ వసూళ్లతోనే పఠాన్ సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు షారుఖ్.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో క్యామియో రోల్ చేయడం బాగా కలిసి వచ్చింది.ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అందులోను సాలిడ్ కంటెంట్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులుగా అవుతున్న ఇంకా కలెక్షన్స్ రాబడుతుంది.

కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న 1000 కోట్ల సాలిడ్ వసూళ్ల క్లబ్ లోకి పఠాన్ సినిమా నిన్న సోమవారం నాటి కలెక్షన్స్ తో టచ్ చేసినట్టు తెలుస్తుంది.1000 కోట్లను టచ్ చేసిన బాలీవుడ్ రెండవ మూవీగా అలాగే ఇండియన్ సినిమా నుండి టాప్ 5 గా నిలిచింది.అంతేకాదు ఈ సినిమా ఫేజ్ 1 నుండి రిలీజ్ అయ్యి 1000 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ సినిమాగా కూడా పఠాన్ నిలిచినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.







