హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడి ఘటనపై జీహెచ్ఎంసీ అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ మేరకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు.
కాగా వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఘటనపై అధికారులు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగానే కుక్కల దాడుల కట్టడికి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్ లో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.







