ఏపీలో రానున్న ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు.టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఓటమి తప్పదని తెలిపారు.
జనసేనకు 50, టీడీపీకి 70, వైసీపీకి 55 సీట్లు వస్తాయని హరిరామ జోగయ్య చెప్పారు.జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బస్సు యాత్రకు ముందు, తర్వాత ఫలితాలపై లేఖ విడుదల చేశారు.
పవన్ బస్సు యాత్రకు ముందు జనసేనకు 15, టీడీపీ 65, వైసీపీ 95 స్థానాలు వస్తాయన్న జోగయ్య… పవన్ బస్సు యాత్ర తర్వాత జనసేనకు 40, టీడీపీకి 55, వైసీపీకి 80 స్థానాలు వస్తాయని లేఖలో పేర్కొన్నారు.







