మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గం, షిండే వర్గానికి మధ్య గత కొన్ని రోజులుగా వార్ కొనసాగుతోంది.శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ షిండే వర్గానికి కేటాయించినట్లు ప్రకటించింది.
అయితే దీన్ని తప్పుబట్టిన థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.మరోవైపు శివసేన పేరు, గుర్తు కేటాయింపులో ఈసీ అమ్ముడుపోయిందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఈ వాదనను షిండే వర్గం ఖండించింది.అయితే పార్టీ పేరు, గుర్తుపై వివాదం సుప్రీంకు చేరడంతో ధర్మాసనం తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







