టాలీవుడ్ లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన చిత్రం పులి మేక.ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో లావణ్య త్రిపాఠితో పాటు ఆది సాయి కుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
కాగా ఈ పులి మేక సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.కాగా ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే.

నేపథ్యంలోనే ప్రేక్షకులకు మరో కంటెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉంది.ఫిబ్రవరి 24న పులి మేక ను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది.ఈ ఒరిజినల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో జాయిన్ అయ్యింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ బాబి అలాగే హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేశారు.
కాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ పులి మేక మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ట్రైలర్ స్టార్టింగ్ లోనే.చావు చెప్పిరాదు, వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి.

డైలాగ్ వినగానే భగవద్గీత గుర్తుకొస్తుంది.ఒన్‌మంత్ బ్యాక్ షామిర్‌పేట్ లేక్ దగ్గర ఎస్ ఆర్ నగర్ ఎస్ ఐ అనిల్ మర్డర్ జరిగింది.ఆ మర్డర్ చేసింది.ఈ మర్డర్ చేసింది ఒక్కరే సార్ అని చెబుతూ ప్రభాకర్ శర్మ కేరక్టర్‌లో పరిచయమవుతారు ఆది.పోలీస్ అఫిషియల్‌గా కనిపిస్తారు సుమన్.ఆయన మాటలను బట్టి ఒక సైకో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడని అర్థమవుతుంది.
మొత్తానికి ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోనుంది అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఇందులో లావణ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనుంది అన్న విషయం తెలిసిందే.
అలాగే ఈ పులిమేక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.







