ఆస్కార్ ఈవెంట్ కోసం యూఎస్ పయనమైన చరణ్.. పిక్స్ వైరల్!

మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ”ఆర్ఆర్ఆర్” చరిత్ర కెక్కింది.‘రౌద్రం రణం రుధిరం’ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

 Ram Charan Flies To The Us Ahead Of The Oscars Event, Rrr, Oscar Event, Ram Char-TeluguStop.com

ఈ భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా అంతర్జాతీయంగా పలు అవార్డులను సైతం అందుకుంది.

ఇక ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్ ‘నాటు నాటు‘ ఈ సాంగ్ ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యి మన ఇండియన్ గర్వించదగ్గ మూమెంట్ క్రియేట్ చేసింది.

Telugu Oscar, Rajamouli, Ram Charan-Movie

కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఆస్కార్ బరిలో ఉంది.ఈ క్రమంలోనే ఈ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యూఎస్ బయల్దేరాడు.మార్చి 12న ఆస్కార్ అవార్డుల ఈవెంట్ జరగనుంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ గత రాత్రి యూఎస్ బయల్దేరాడు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న రామ్ చరణ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Telugu Oscar, Rajamouli, Ram Charan-Movie

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కోసం అతి త్వరలోనే మిగిలిన యూనిట్ తో సహా రాజమౌళి, ఎన్టీఆర్ కూడా అక్కడికి చేరుకోనున్నట్టు సమాచారం.మొత్తానికి మొదటిసారి మన తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.చూడాలి మరి ఇక్కడ కూడా మన తెలుగు సినిమాకు అదృష్టం వరిస్తుందో లేదో.ఈ ఆస్కార్ బరిలో అవార్డు గెలుచుకుంటే రికార్డ్ క్రియేట్ చేసినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube