టర్కీ సిరియా ప్రాంతాలలో ఫిబ్రవరి 6వ తారీకు భూకంపం రావడం తెలిసిందే.రీక్టార్ స్కేలు పై 7.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి దాదాపు 40 వేలకు పైగా మరణాలు సంభవించాయి.కొన్నివేల భవనాలు నేలమట్టమయ్యాయి.
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.భూకంపా తీవ్రతకి చాలామంది చనిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు టర్కీకి సహాయం చేస్తూ ఉన్నాయి.ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరోసారి టర్కీ సిరియా సరిహద్దు ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించింది.

ఈ పరిణామంతో ఈ రెండు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రెండు వారాల క్రితం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.వెయ్యికి పైగా ప్రకంపనాలు నమోదయ్యాయి.ఈ భారీ భూకంపా తీవ్రతకి పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.ఇంకా శిధిలాల తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి.ఇటువంటి పరిస్థితులలో మరోసారి భూకంపం రావటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.







