టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.2021 లో విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రేక్షకులు పుష్ప పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
పుష్ప 2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే పుష్ప 2 సినిమా షూటింగ్ ఇటీవలె మొదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది.పార్ట్ 1 తో పోల్చుకుంటే పార్ట్ 2 సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతి పండుగకు కాకుండా వేసవిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.2024 ఏప్రిల్ లేదా మే నెలలో పుష్ప 2 సినిమాను గ్రాండ్ గా విడుదల గ్రాండ్ గా విడుదల చేయాలని ఫైనల్ అయ్యారట సుకుమార్.

దీంతో ఇది బన్నీ ఫ్యాన్స్ లో కాస్త నిరాశ కలిగించే అంశంగా మారింది.సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నా ఈ సినిమాను మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత కు పోస్ట్ పోన్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20 కి పైగా దేశాల్లో విడుదల చేయాలని టార్గెట్ ని పెట్టుకున్నారట సుకుమార్.అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే బన్నీ రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఇకపోతే పుష్ప 2 ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ చేస్తున్నారు.దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అనసూయతో ఐటెం సాంగ్ కూడా ఉండనుందనే టాక్ బయటకు రావడం మరింత హుషారెత్తిస్తోంది.







