నీరు లేకుండా ఈ భూమిపై జీవించడం అసాధ్యం.ప్రకృతి ఇచ్చిన బహుమతులలో నీరు కూడా ఒకటి.
భూమిపై నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ నీటిలో 97 శాతం తాగే నీరు కాదు.అదంతా సముద్రంలోని ఉప్పు నీరు.
మిగిలిన నీరు 3 శాతం మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుంది.ఒకప్పుడు తాగే నీరు ఉచితంగా దొరికేది.
ప్రస్తుతం అంతా వ్యాపారమయం కావడంతో డ్రింకింగ్ వాటర్ కూడా ఖరీదుగా అయిపోయింది.లీటర్ నీరు రూ.20 మొదలు వేలల్లో సైతం పలుకుతోంది.అయితే బాటిల్‌పై పరిశీలించినప్పుడు దానిపై ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.
దీంతో నీటికి కూడా ఎక్స్ పైరీ ఉంటుందని, గడువు దాటిని నీటిని తాగకూడదని కొందరు వాదిస్తుంటారు.దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

తినే ఆహార పదార్థం, తాగే నీరు, జ్యూసులు ఇలా చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.కొంత కాలం తర్వాత అవి పాడైపోతాయి.ఆహార పదార్థాలు అయితే బూజు పడతాయి.తింటే ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తోంది.ఇక వాటర్ బాటిల్లో నీటిని చూసినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, కాబట్టి గడువు ముగిసిన నీటిని తాగితే ఇబ్బందులు వస్తాయని అంతా భావిస్తారు.అయితే అది తప్పని నిపుణులు చెబుతున్నారు.
నీరు కార్బోనేట్ అయినప్పుడు, దాని రుచి మారుతుంది.అలాగే గ్యాస్ దాని నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది.
కానీ శాస్త్రవేత్తలు నీరు అంత తేలికగా గడువు ముగియదని చెప్పారు.సాధారణ నీటితో పోలిస్తే ప్యాకేజీ చేసిన నీటిని గడువు ముగియవచ్చు.
లేదా చెడిపోవచ్చు.సాధారణంగా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచిన నీటి గడువు తేదీ 2 సంవత్సరాల వరకు ఉంటుంది.
కానీ ఈ నీటి బాటిల్ సూర్యకాంతి పడుతున్నప్పుడు బాటిల్లోని పాలిథిలిన్ టీర్ఫ్ట్లేట్ నీటిలో కరగడం ప్రారంభిస్తుంది.ఫలితంగా పునరుత్పత్తి సమస్య, నాడీ, రోగనిరోధక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి.
అయితే నీటిని వేడి చేసుకుంటే ఏ సమస్యా ఉండదని నిపుణులు చెబుతున్నారు.నీరు ఎన్ని రోజులైనా పాడయ్యే అవకాశం ఉండదని సూచిస్తున్నారు.







