తెలుగు స్టేట్స్ లో 'సార్' వసూళ్లు.. రెండు రోజుల్లోనే గట్టిగా రాబట్టిన ధనుష్!

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సార్’. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Sir Movie 2 Days Telugu Collections, Dhanush, Sir Movie, Kollywood, Sir 2 Days C-TeluguStop.com

ఈ సినిమాతో తమిళ్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు.మరి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కు తెలుగు ప్రేక్షకులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు.

Telugu Dhanush, Kollywood, Samyukta Menon, Sir Days, Sir, Sir Days Telugu, Sir R

తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా.జివి ప్రకాష్ సంగీతం అందించాడు.వెంకీ అట్లూరి మొదటి మూడు సినిమాలు కూడా ప్రేమ కథలను తెరకెక్కించిన వెంకీ ఈసారి మాత్రం రూటు మార్చి సోషల్ ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దీంతో ఈ విషయం కూడా ధనుష్ కు బాగా కలిసొచ్చింది.

ఎందుకంటే ఎప్పటిలా ప్రేమ కథనే తెరకెక్కించి ఉంటే ఈయనకు ఆశించిన విజయం దక్కేది కాదు.కానీ ఈసారి మాత్రం వెంకీ అట్లూరి కొత్త జోనర్ లో సినిమా చేసి మంచి హిట్ ను అందుకున్నాడు.

ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నారు.

Telugu Dhanush, Kollywood, Samyukta Menon, Sir Days, Sir, Sir Days Telugu, Sir R

ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా 10 కోట్లకి పైగానే గ్రాస్ ని అందుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.అంతేకాదు మొదటి రోజు కన్నా రెండవ రోజు ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టిందట.మూడవ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి మేకర్స్ పెట్టుకున్న అంచనాలను అయితే సార్ రీచ్ అవ్వబోతుంది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube