తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా తన పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడం కోసం ఈయన అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది పవన్ కళ్యాణ్ కు అభిమానులుగా ఉన్న బుల్లితెర నటీనటులు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు బుల్లితెర సీరియల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.దీంతో ఈయన కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన పార్టీలో చేరబోతున్నారని పలువురు భావిస్తున్నారు.
సాగర్ కు బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లను టార్గెట్ చేస్తూ ఈయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించారని పలువురు భావిస్తున్నారు.
ఇకపోతే సాగర్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇలాంటి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఈ సందర్భంగా సాగర్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ… పవర్ ఫుల్ లీడర్ పవన్ కళ్యాణ్ అన్నని కలవడంతో ఈరోజును ఎంతో అద్భుతంగా ప్రారంభించాను.ఎంతో వినయపూర్వకమైన, నిరాడంబరమైన వ్యక్తితో కొంత సమయాన్ని గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది.
పీకే అన్నతో అద్భుతమైన భేటీ జరిగిందని భావిస్తున్నాను అంటూ ఈయన ఇంస్టాగ్రామ్ ద్వారా పవన్తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ తెలియజేశారు దీంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.