వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న ఎన్టీఆర్‌కు పూరి దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రం కాస్త ఊరటనిచ్చింది.ఆ చిత్రం తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పుంజుకున్నాడు.
ఎన్టీఆర్‌కు ఆ చిత్రం చాలా నూతనోత్సాహం ఇచ్చింది అనడంలో సందేహం లేదు.ఆ సినిమా కమర్షియల్‌గా పర్వాలేదు అన్నట్లుగా ఆడినా కూడా ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో మైలు రాయి చిత్రంగా నిలిచి పోయింది.
ఆ సినిమాలోని పలు సీన్స్ ఎన్టీఆర్‌లోని నటన విశ్వరూపం చూపించాయి.ఎన్టీఆర్‌లోని పూర్తి నటనను పూరి రాబట్టాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

టెంపర్ విడుదల అయ్యి రేపటికి అయిదు సంవత్సరాలు కాబోతుంది.ఈ నేపథ్యంలో నందమూరి అభిమానుల కోసం ప్రసాద్‌లో ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు.చిత్ర యూనిట్ సభ్యులు పలువురు ఈ స్పెషల్ షోలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్ కూడా ఈ ప్రత్యేక షోకు హాజరు అవుతాడని, కొద్ది మంది ఫ్యాన్స్‌ను మాత్రమే చిత్ర యూనిట్ సభ్యులు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు పూరి ఈ షోను ఏర్పాటు చేయించాడని సమాచారం అందుతోంది.

చిత్రంలో నటించిన ప్రముఖులతో పాటు టెక్నీషియన్స్ మరియు ఫ్యాన్స్ ఈ ప్రత్యేక షోలో గెట్ టు గెదర్ కాబోతున్నారు.టెంపర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఈ షోపై చాలా ఆసక్తిగా ఉన్నారు.అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా టెంపర్ గురించిన చర్చ జరుగుతూనే ఉంది.
అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని వెంటనే ఉరి తీయాలి అనేది ఆ సినిమా కాన్సెప్ట్.ఎన్టీఆర్ చాలా అద్బుతంగా పోలీస్ పాత్రలో నటించి మెప్పించాడు.