ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.పవన్ పై విమర్శలు చేయడానికి చాలామంది పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ ప్రధానంగా పవన్ పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ షోలో పవన్ తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఉన్న పరిస్థితులను వివరించారు.తప్పనిసరి పరిస్థితులే మూడు పెళ్లిళ్లకు కారణమని ఆయన పేర్కొన్నారు.
అయితే పవన్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసేవాళ్లకు బుద్ధి వచ్చేలా నటి కాకినాడ శ్యామల ఒకింత ఘాటుగా జవాబిచ్చారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ కలిస్తే ప్లస్ అవుతుందని ఆమె తెలిపారు.
పవన్ ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతారని కాకినాడ శ్యామల అన్నారు.పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శిస్తున్నారని కావాలంటే నువ్వు నలుగురిని చేసుకో అని ఆమె తెలిపారు.

పవన్ అందరికీ న్యాయం చేసి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని మూడు కాకపోతే ముప్పై మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడని అది ఆయన వ్యక్తిగత జీవితం అని కాకినాడ శ్యామల పేర్కొన్నారు.రాజకీయాల్లో ఏమైనా చెడు చేస్తే పవన్ పై విమర్శలు చేయాలని ఆయన తెలిపారు.పవన్ పై విమర్శలు చేయడానికి ఇంకేం లేవా అని ఆమె ప్రశ్నించారు.ఓట్లకు ఇచ్చే డబ్బు తీసుకో నచ్చినవాళ్లకు ఓటేయని రజనీకాంత్ చెబుతారని కాకినాడ శ్యామల అన్నారు.

ఉచిత పథకాల వల్ల ప్రజలపై భారం పడుతుందని ఆమె పేర్కొన్నారు.ఏపీ చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయిందని ఈ విషయంలో బాధగా అనిపిస్తుందని కాకినాడ శ్యామల తెలిపారు.చంద్రబాబు పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా కష్టపడాలని ఆమె కామెంట్లు చేశారు.అమరావతి స్థలాలు అక్కడే ఉన్నాయని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.తెలంగాణలో పాలన బాగానే ఉందని కేసీఆర్ బాగానే చేస్తారని ఆమె కామెంట్లు చేశారు.







