సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వారిలో కూడా ఆధ్యాత్మిక కోణం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు తరచూ పలు ఆలయాలకు వెళ్తూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం సమంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మెట్టుకు బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రతి ఒక్కరు కూడా వారికి వీలు కుదిరినప్పుడు దైవ సన్నిధికి వెళ్తూ ఉంటారు.
ఇకపోతే నేడు శివరాత్రి పర్వదినం కావడంతో నటి పూజా హెగ్డే శివరాత్రి పండుగ తనకు ఎంత స్పెషల్ అనే విషయాన్ని తెలియజేశారు.తన తండ్రి శివ భక్తుడని చిన్నప్పటి నుంచి ప్రతి శివరాత్రికి తన తండ్రి ఉపవాసం ఉండి పూజ చేసేవారని తెలిపారు.ఇలా తన తండ్రిని చూస్తూ పెరిగిన తనకు కూడా శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం అలవాటైందని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా శివరాత్రి రోజు తాను తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని పూజా హెగ్డే తెలిపారు.
ఈ క్రమంలోనే రంగస్థలం సినిమాలో ఈమె జిగేలు రాణి అనే పాటలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ పాట గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ఈ పాట షూట్ చేసే రోజు శివరాత్రి వచ్చింది.దీంతో తాను ఆ రోజంతా ఉపవాసంతో ఉంటూ ఈ పాట షూటింగ్ పూర్తి చేశానని ఈ సందర్భంగా రంగస్థలం సినిమాలోని జిగేలు రాణి పాట గురించి పూజా హెగ్డే చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా నటిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే గత ఏడాది నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.అయితే ప్రస్తుతం ఈమె త్రివిక్రమ్ మహేష్ సినిమాలో మహేష్ కి జోడిగా సందడి చేయబోతున్నారు.
మరి త్రివిక్రమ్ సినిమా ఆయన ఈమెను సేవ్ చేస్తుందో లేదో చూడాలి.