హెయిర్ ఫాల్‌ ను అరికట్టే మినుములు.. ఎలా వాడాలో తెలుసా?

హెయిర్ ఫాల్ అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే సమస్యే.కానీ కొందరిలో మాత్రం ఇది చాలా తీవ్రంగా ఉంటుంది.

 Black Gram Helps To Stop Hair Fall Quickly! Black Gram, Stop Hair Fall, Hair Fal-TeluguStop.com

దీంతో ఈ సమస్య నుంచి బయటపడటం కోసం తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.ఖ‌రీదైన షాంపూ, ఆయిల్ ను వాడుతుంటారు.

అయినా సరే సమస్యకు పరిష్కారం లభించకపోతే తెగ హైరానా పడిపోతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఎందుకంటే మినుములు హెయిర్ ఫాల్ ను అరికట్టేందుకు అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఇంతకీ మినుములను జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పొట్టు తొలగించిన మినుములను ఐదు టేబుల్ స్పూన్లు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినుములు వేసుకోవాలి.అలాగే రెండు మందార పువ్వులను వేసుకోవాలి.

చివరిగా ఒక కప్పు బియ్యం కడిగిన వాటర్ ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Black Gram, Blackgram, Black Gram Pack, Care, Care Tips, Fall, Latest-Tel

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమంలో ఒక ఎగ్ వైట్ మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Black Gram, Blackgram, Black Gram Pack, Care, Care Tips, Fall, Latest-Tel

వారానికి ఒక్కసారి మినుములతో ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ అనేది క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.కాబట్టి అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube