టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులకు సేవ, సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉండే కుటుంబం మెగా ఫ్యామిలీ అనే సంగతి తెలిసిందే.తెలుగులో పలు సినిమాలలో నటించి పాకీజా రోల్ ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాసుకి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడైంది.
అయితే నాగబాబు, చిరంజీవి చేసిన సహాయాల ద్వారా వాసుకి జీవితం మారిపోయింది.

ప్రస్తుతం ఆమెకు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో, ఓటీటీల ప్రోగ్రామ్ లలో, కామెడీ షోలలో అవకాశాలు వస్తున్నాయి.మెగా ఫ్యామిలీ కాళ్లు పట్టుకుని రుణం తీర్చుకోవాలని ఉందంటూ పరోక్షంగా వాసుకి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.మెగా ఫ్యామిలీ దయ వల్లే ప్రస్తుతం తాను మంచి పొజిషన్ లో ఉన్నానని వాసుకి వెల్లడించారు.
వాసుకికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అంతకంతకూ పెరుగుతోంది.

మోహన్ బాబు సైతం త్వరలో తన వంతు సహాయం చేస్తానని వాసుకికి చెప్పినట్టు తెలుస్తోంది.లైఫ్ లో మరిచిపోలేని సహాయం మెగా హీరోల నుంచి దక్కిందని వాసుకి వెల్లడించారు.ఆమె ఫోన్ నంబర్ కు ఎంతోమంది నుంచి ఆర్థిక సహాయం కూడా అందుతోందని తెలుస్తోంది.
తనకు సహాయం చేసిన వాళ్లకు వాసుకి కృతజ్ఞతలు చెప్పినట్టు సమాచారం అందుతోంది.వాసుకికి కొన్ని నెలల క్రితం వరకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు.

మెగా హీరోల సినిమాలలో సైతం వాసుకికి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.జనసేన తరపున ప్రచారం చేయడంతో పాటు పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్టు బోగట్టా.జనసేన తరపున వాసుకి నిజంగానే పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది.జనసేనను అభిమానించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.జనసేన రాబోయే రోజుల్లో పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.







