క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.ఐపీఎల్ -2023 షెడ్యూల్ విడుదలైంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 16వ సీజన్ షెడ్యూల్ ను ఐపీఎల్ మ్యాచ్ ల బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది.భారత్ వేదికగానే ఈ సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
మొత్తం 70 లీగ్ మ్యాచ్ లుండగా… 18 డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి.
కాగా బీసీసీఐ నేతృత్వంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 15 సీజన్లు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే.
కాగా గత ఏడాది గుజరాత్ టైటాన్స్ టీమ్ విజేతగా నిలిచింది.షెడ్యూల్ ప్రకారం మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి.
ఫస్ట్ మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆడనుంది.అహ్మదాబాద్ వేదికగా మార్చి 31 రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొనబోతున్నాయి.







