అమీ జాక్సన్ పరిచయం అవసరం లేని పేరు తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో ఓ మెరుపు మెరుసిన ఈ మెరుపుతీగ అనంతరం రజనీకాంత్ 2.0, విక్రమ్ ఐ వంటి సినిమాలలో నటించి మెప్పించారు.ఇలా ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.తరచూ గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్ లో నిర్వహించడం ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో ప్రేమలో పడిన అమీ జాక్సన్ తనతో సహజీవనం చేస్తూ పెళ్లి కాకుండానే ఓ అబ్బాయికి జన్మనిచ్చారు.ఇలా పెళ్లి కాకుండానే జన్మనివ్వడంతో ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.తరచూ తన కుమారుడితో ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అయితే తన ప్రియుడిని పెళ్లి చేసుకోకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

ఇలా తన ప్రియుడి నుంచి విడిపోయిన అమీ జాక్సన్ తన కొడుకు బాగోగులు చూసుకుంటూ ఉన్నారు.అయితే ఈమె తాజాగా మరొక వ్యక్తి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది.
ఇప్పటివరకు వెస్ట్వీక్ తో ప్రేమ ప్రయాణాన్ని రహస్యంగా ఉంచిన ఈమె వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడుని అందరికీ పరిచయం చేశారు.ఈ క్రమంలోనే తన ప్రియుడి కౌగిలిలో బందీ అవుతూ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త ప్రియుడుని ఈమె పరిచయం చేశారు.
దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







