భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంపి స్కిన్ వ్యాధి తీవ్ర కల్లోలం సృష్టిస్తుంది.దమ్మపేట మండలంలో పశువులు లంపి వైరస్ బారినపడుతున్నాయి.
దమ్మపేటలో సుమారు పది ఆవులకు వ్యాధి సోకినట్లు పశుశాఖ వైద్యాధికారులు నిర్ధారించారు.దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తమకు జీవానాధారంగా నిలిచే పశువులన్నీ క్రమంగా వ్యాధి బారిన పడటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే వైరస్ సోకిన పశువులను ఇతర పశువుల మందకు దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.







