లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది.పెళ్లి మరియు పిల్లల కారణంగా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది.
ఎట్టకేలకు నయనతార మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతుంది అంటూ సమాచారం అందుతుంది.పెళ్లి కి ముందు తెలుగు సినిమాల పట్ల ఆసక్తి చూపించని నయనతార తాజాగా ఒక తెలుగు సినిమా లో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.
అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఈ మధ్య కాలం లో తమిళ హీరోలు తెలుగు లో సినిమాలు చేస్తూ ఇక్కడ అక్కడ మంచి మార్కెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళం లో ఎలాగూ భారీగా కలెక్షన్స్ నమోదు అవుతాయి.తెలుగు బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్స్ అదనంగా ఉంటాయి.కనుక తెలుగు సినిమా చేయాలనే నిర్ణయానికి నయనతార కూడా వచ్చినట్లు తెలుస్తోంది.తెలుగు లో సినిమా ను చేసినా కూడా ఆ సినిమా ను తమిళం లో భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల టాక్.
ఇంతకూ నాయనతార కు లేడీ ఓరియంటెడ్ కథ చెప్పిన దర్శకుడు ఎవరు.

ఏ నిర్మాత ఆ సినిమా ని నిర్మించబోతున్నాడు అనే విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.కానీ అతి త్వరలోనే నయనతార నుండి ఆ విషయమై క్లారిటీ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హిందీ లో నయనతార, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న జవాన్ సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా యొక్క చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.జవాన్ సినిమా తర్వాత హిందీలో కూడా నయనతార బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.
మొత్తానికి నయనతార సౌత్ మరియు నార్త్ లో కూడా బిజీ బిజీ గా సినిమాలు చేయబోతోంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







