ప్రభాస్ శ్రీనుహీరో ప్రభాస్ దగ్గర ఎక్కువ కాలం అసిస్టెంట్ గా పనిచేయడంతో అతడికి ప్రభాస్ శ్రీను అనే పేరు ముద్ర పడిపోయింది అయితే నటుడిగా కమీడియన్ గా శ్రీనుకి తెలుగులో తమిళ్ లో మరియు మలయాళంలో అనేక అవకాశాలు వచ్చాయి.కానీ ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ శ్రీను పై టాలీవుడ్ లో టైం కు రాడు, ఎప్పుడూ మందు తాగుతూ ఉంటాడు అని పేరు ముద్ర పడిపోయింది.
ఎందుకు సమాధానం ఇస్తూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ శ్రీను.ఇండస్ట్రీలో నేను మాత్రమే కాదు ఎవరూ కూడా టైం కురారు కానీ వారికి నచ్చిన నటులు లేటుగా వచ్చినా పర్వాలేదు కానీ నాలాంటి చిన్న వ్యక్తి లేటుగా వస్తే ఒక ముద్ర వేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.
![Telugu Kollywood, Prabhas, Prabhas Seenu, Tollywood, Viarl-Latest News - Telugu Telugu Kollywood, Prabhas, Prabhas Seenu, Tollywood, Viarl-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2023/02/Prabhas-seenu-tollywood-wife-remuneration.jpg)
కెరియర్ మొత్తం మీదుగా 400 సినిమాల్లో నటించినప్పటికీ దాదాపు 100కు పైగా సినిమాలకు రెమ్యూనరేషన్ ఇప్పటివరకు తీసుకోలేదని వారు ఇచ్చే స్థితిలో కూడా లేరని అంటున్నాడు.పైగా నాకున్న అప్పులకు నేను ఎంత సంపాదించినా సరిపోదని నా దరిద్రాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒకరోజు మూడు సినిమాల కోసం అడ్వాన్సుగా 15 లక్షల రూపాయలు వస్తే సాయంత్రం వరకు ఒక రూపాయి కూడా చేతిలో లేదని అన్ని అప్పులు తీర్చేశానని చెప్పాడు.నా భార్య నాకు ఎప్పుడూ ఒకే మాట చెబుతుంది అప్పులు పెట్టుకోకు ఎప్పటికప్పుడు తీర్చేసేయ్ వ్యసనాలను మానుకో అంటూ చెప్పినప్పటికీ తాను ఎప్పుడూ వినలేదని కూడా చెప్తున్నాడు ప్రభాస్ శ్రీను.
![Telugu Kollywood, Prabhas, Prabhas Seenu, Tollywood, Viarl-Latest News - Telugu Telugu Kollywood, Prabhas, Prabhas Seenu, Tollywood, Viarl-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/02/tollywood-wife-social-media-viarl-remuneration-prabhas.jpg )
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవ్వరూ మంచిగా ఉండరని మన ముందు ఒకలా మాట్లాడుతారు మనం లేని టైంలో మరోలా మాట్లాడతారు.అందుకే నేను ఎవరితో సఖ్యతగా ఉండలేను.నా పని ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతాను కెమెరా ఆన్ అయింది అంటే నలుగురిని నవ్వించే ఏదో ఒక సీన్ చేసి నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చాడు శ్రీను.
కానీ ఎన్ని సినిమాల్లో నటించిన కూడా నాకు జాగ్రత్త లేకపోవడం వల్ల ఒక రూపాయి కూడా సేవ్ చేయలేకపోయాను అంటూ చెప్పవచ్చాడు.నా అలవాట్లు కూడా నన్ను తప్పుడు దోవలో పయనించేలా చేశాయి.
కానీ అన్ని తెలిసిన ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ చెప్తున్నాడు.