దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో సౌత్ గ్రూప్ లోని కీలక వ్యక్తులకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినోయ్ బాబులు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే కేసు దర్యాప్తు జరుగుతోందన్న ఈడీ నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరింది.
ఈ నేపథ్యంలో ఈడీ వాదనలతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ కు నిరాకరించింది.ప్రస్తుతం నిందితులంతా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.







