వెండి రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... సంతోషంలో నందమూరి ఫ్యాన్స్!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసినటువంటి దివంగత నటుడు నందమూరి తారక రామారావు గురించి ఆయన సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.ఇలా నందమూరి తారక రామారావు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను చేపట్టి రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

 Central Government To Print Nandamuri Taraka Ramarao Picture On 100 Rupees Silve-TeluguStop.com

ఇలా చిత్ర పరిశ్రమలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్నో సేవలను అందించి ఎంతో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందిస్తోంది.

Telugu Central, Nandamuri, Nandamuri Fans, Nandamuritaraka, Ntr Rupees Coin-Movi

ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు బొమ్మతో వెండి 100 రూపాయల నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.ఈ నాణెం పూర్తిగా వెండితోనే తయారు చేయనున్నారు.నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెంపై సలహాలు సూచనలు కోరారు.2022 మే 28వ తేదీ నుండి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఇలా ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ వెండి నాణెం విడుదల చేయాలని భావించారు.

Telugu Central, Nandamuri, Nandamuri Fans, Nandamuritaraka, Ntr Rupees Coin-Movi

ఈ విధంగా ఎన్టీఆర్ బొమ్మతో వెండి నాణెం విడుదల చేయబోతున్నారని తెలియడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు.1964 నుండి ఈ విధంగా నాణేలను విడుదల చేయడం ప్రారంభించారు.మొదట నెహ్రూ నాణెం విడుదల చేయడం విశేషం.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వెండి నాణెం విడుదల చేయడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube