సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు.సెలబ్రిటీలకు సంబంధించిన ఎటువంటి విషయం అయినా కూడా వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది.
డైలీ ఆక్టివిటీస్ నుండి ఫోటోషూట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా వైరల్ అవుతూనే ఉంటాయి.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ మాళవిక శర్మ చేసిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.
మాళవిక శర్మ వెజిటేబుల్స్ కట్ చేస్తుండగా పొరపాటున ఆమె వేలు కట్టయ్యింది.ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఆ వీడియోలో ఆమె క్యాప్సికం కట్ చేస్తూ ఉండగా ఇంతలో అనుకోకుండా తన వేలు కట్ కావడంతో వెంటనే ఆమె పైకి ఎగిరి గంతులు వేస్తూ తన చేతికి వస్తున్న బ్లడ్ ని చూపిస్తూ అక్కడి నుంచి పరుగులు తీసింది.వేలు నొప్పికి తట్టుకోలేక విలవిల్లాడిపోయింది.కాగా ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.మాళవిక శర్మ ఏమని రాసిందంటే నేను కిచెన్‌లోకి వెళ్లడానికి పనికి రాను అనడానికిది సంకేతమనుకుంటా అని రాసుకొచ్చింది.
ఇకపోతే మాళవిక శర్మ గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక శర్మ. తన అందం నటనతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ఈ సినిమా తరువాత టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.







