తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు తాజాగా శ్రీదేవి శోభన్ బాబు సినిమా వేడుకలు పాల్గొన్నారు.సంతోష్ శోభన్ గౌరీ జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ క్రమంలోనే బుధవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ సినిమాకు మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటుడు నాగబాబు నటించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ముందుగా నిర్మాతగా మారిన సుస్మిత పై ఈయన ప్రశంసలు కురిపించారు.తన ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ సుస్మిత మాత్రం ఎవరి సహాయం తీసుకోకుండా ఇండస్ట్రీలో ఎదుగుదలకు కృషి చేస్తుందని తెలిపారు.
ఇకపోతే తన ఇంట్లో చాలామంది హీరోలు ఉన్నారు అయినా కానీ ఎవరూ కూడా తనకు సినిమాలలో నటించే అవకాశం ఇవ్వలేదు.మొదటిసారి మా సుస్మిత తనకు నటించే అవకాశం ఇచ్చిందని నాగబాబు తెలిపారు.
ఇది తనకు సుస్మిత నుంచి మొదటి అవకాశం కాదని ఇదివరకే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించానని నాగబాబు గుర్తు చేసుకున్నారు.ఇక మెగా కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎంతో మంది హీరోలు సుస్మితను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సుస్మిత మాత్రం వారి సహాయం తీసుకోకుండా ఇండస్ట్రీలోకి కొత్త నిర్మాతలు వస్తే ఎలా కష్టపడతారో ఈమె కూడా అలాగే కష్టపడుతూ వచ్చారని త్వరలోనే ఈమె గర్వించదగ్గ మెగా ప్రొడ్యూసర్ గా మారిపోతారని నాగబాబు తెలిపారు.ఇక ఇప్పటికీ మహిళలు అన్ని రంగాలలో ఎంతో సక్సెస్ అయ్యారు కానీ సినిమా రంగంలో మాత్రం అమ్మాయిలను పంపించడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.ఇంకా మన ఆలోచన ధోరణి ఏ మాత్రం మారలేదని వారికి కూడా అవకాశాలిస్తే సినిమా రంగంలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధిస్తారని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.