ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలున్నా క్రికెట్ కి ఉన్న ఆదరణే వేరు.ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే దేశంలో కూడా ఉండదు అని చెప్పుకోవాలి.
ఈ క్రమంలోనే సినిమా హీరోల తరువాత ఇక్కడ అత్యంత ఎక్కువగా ఆరాధిస్తున్నది క్రికెటర్లను మాత్రమే.ఇటీవల కాలంలో చూసుకుంటే ఎంతోమంది చిన్నప్పటినుంచి క్రికెట్ ఊపిరిగా బ్రతుకుతూ టీమిండియా తరఫున ఆడడమే లక్ష్యంగా గోల్ పెట్టుకొని మరీ ఆడుతున్నారు.
ఇక ఇటువంటి మట్టిలో మాణిక్యాలు లాంటి ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది.ఎంతలా అంటే అది ఆఖరికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కంట్లో పడేంత.అవును, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే కొంతమంది చిన్నారులు గల్లి క్రికెట్ ఆడుతున్నట్టు స్పష్టంగా గోచరిస్తోంది.
ఇక అక్కడ బ్యాటింగ్ చేస్తున్న చిన్నారి అచ్చం టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ తరహా లోనే అద్భుతమైన షాట్లు కొట్టడం చూడవచ్చు.ప్రతి బంతిని సిక్సర్ కొట్టుతూ ఇక అదరగొట్టింది అని చెప్పాలి.

దాంతో ఈ లేడీ సూర్యకుమార్ ఆట తీరు చూసి ఏకంగా సచిన్ ఫిదా అయిపోయాడు.స్వయంగా ఆ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ కు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆమెని తెగ పొగిడేసాడు.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన వేలం ప్రక్రియ ముగిసింది లేదో.అప్పుడే మ్యాచ్ ప్రారంభమైందా అంటూ కామెంట్ చేయడం ఇక్కడ విశేషం.నీ బ్యాటింగ్ బాగా ఎంజాయ్ చేశాను! అంటూ ఒక కామెంట్ కూడా ఇక్కడ చేయడం కొసమెరుపు.కాగా ఆమె రాజస్థాన్ కు చెందిన అమ్మాయిలాగ కనబడుతోంది.
కేవలం సచిన్ మాత్రమే కాదు బిసిసిఐ సెక్రటరీ జై షా సైతం చిన్నారి టాలెంట్ కి ఫిదా అయిపోయాడు.







