సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.ఈయన కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.
ఈ ఏజ్ లో కూడా ఈయన సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండుగే.అలా రజనీకాంత్ స్టైలిష్ లుక్ తో ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.
ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ”జైలర్”..ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ నెలకొంది.ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పలు అప్డేట్ లను అనౌన్స్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే అనేక మంది స్టార్ నటులను భాగం చేసారు.
ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ సినిమా కాస్టింగ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఇప్పటికే హిందీ, తమిళ్, మలయాళం నటీనటులను తీసుకున్నారు.ఇక ఇప్పుడు కన్నడ మరియు తెలుగు నుండి కూడా సీనియర్ స్టార్ హీరోలను క్యామియో రోల్ కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.మరి ఆ స్టార్ హీరోలు ఎవరో ముందు ముందు తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సందర్భంగా నటీనటులు కూడా ఆ రేంజ్ లోనే తీసుకుంటూన్నారు.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.








