జగిత్యాల జిల్లా కొండగట్టుకు సీఎం కేసీఆర్ బయలుదేరారు.పర్యటనలో భాగంగా కొండగట్టు ఆంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇటీవల కొండగట్టు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.కొండగట్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ పై సమీక్షించనున్నారు.కేసీఆర్ టూర్ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.







