టాలీవుడ్ లో గత రెండు దశాబ్దాలుగా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మలు కొద్ది మందే ఉన్నారు.వారిలో త్రిష మరియు శ్రియ ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు.
వీరిద్దరూ ఈ మధ్య కాలం లో కాస్త స్లో అయ్యారు.కానీ మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేశారు.
ప్రస్తుతం సినిమాలు చేయకున్నా కూడా వీరికి మంచి క్రేజ్ ఉంది అనడం లో సందేహం లేదు.నాలుగు పదుల వయసు లో కూడా వీరిద్దరూ అందాల ఆరబోత విషయం లో పోటీ పడుతూ ఉంటారు.
సీనియర్ హీరోలకు ఇప్పటికీ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లుగా వీరిద్దరూ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో పాటు యూత్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ అమ్మడు ఇద్దరు కూడా సినిమాలు చేయడం జరుగుతుంది.
అందుకే ఇన్నాళ్లు సినీ కెరియర్ కొనసాగించారు.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో నాలుగు పదుల వయసు వచ్చేటటికి ఏ ఒక్కరు కనిపించక పోవచ్చు.అలాగే 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు కూడా లేవు.వీరిద్దరూ మరో 10 సంవత్సరాల పాటు హీరోయిన్ గా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు గా కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆ తర్వాత కోరుకుంటే యంగ్ హీరోలకు అమ్మగా, అక్కగా, అత్తగా కూడా నటించే అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.ఇక శ్రియ ఇప్పటికే పెళ్లి చేసుకొని తల్లి కూడా అయింది.
కానీ త్రిష మాత్రం ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు.త్వరలో ఆమె పెళ్లి కాబోతుందనే ప్రచారం తమిళ మీడియా లో జోరుగా సాగుతుంది.
తెలుగులో శ్రియ ఒక రెండు సినిమాల్లో నటిస్తుంది.త్రిష మాత్రం తమిళం లో వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.







