ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు వాలెంటైన్స్ డేను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ తమలో ఉన్నటువంటి ప్రేమను బయటపెడుతున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా భార్య మిహికా బజాజ్ సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా రానాతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ రానా పై తనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా మిహికా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ… నేను చాలా స్ట్రాంగ్, వైల్డ్ , స్వీట్ ఇంకా వండర్ ఫుల్ ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు.అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు.(నవ్వుతూ) నువ్వు రోజంతా నన్ను విసిగించిన నీ నవ్వు తిరిగి నన్ను నీ ప్రేమలో పడేలా చేస్తుంది.

హ్యాపీ వాలెంటైన్స్ డే రానా అంటూ మిహికా బజాజ్ సోషల్ మీడియా వేదికగా రానా పై తనకున్నటువంటి ప్రేమను తెలియజేశారు.

ఇలా ఈమె ఇలాంటి ఒక రొమాంటిక్ ఫోటోని షేర్ చేస్తూ రానా పై తనకున్న ప్రేమను తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఈ పోస్టుపై వెంకీ కుమార్తె ఆశ్రిత స్పందిస్తూ క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్ చేశారు.ఇలా ఎంతోమంది అభిమానులు సైతం ఈ పోస్టుపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఈయన హీరోగా నటించిన విరాటపర్వం సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు కమిట్ అవలేదు.అయితే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.







