పవన్ కళ్యాణ్ హీరో గా సాహూ సుజిత్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందిబోతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఆ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
సాహో సినిమా నిరాశ పరిచినా కూడా పవన్ కళ్యాణ్ పిలిచి మరి సుజిత్ కి అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.సుజిత్ దర్శకత్వం లో పవన్ హీరో గా చేస్తున్న సినిమా ఎలా ఉంటుంది అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక తమిళ సినిమా కు ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలుసు.కానీ ఆ సినిమా ఏంటి, దాన్ని పవన్ కళ్యాణ్ కోసం సుజిత్ ఎలా మార్చాడు అనేది మాత్రం క్లారిటీ లేదు.మొత్తానికి షూటింగ్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.మరి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.పూజ కార్యక్రమాలు నిర్వహించారు కనుక రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యి ఉంటాయి అని చాలా మంది భావిస్తున్నారు.కేవలం 30 నుండి 35 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కు డేట్స్ కేటాయించడం జరిగిందట.
అందుకే సాధ్యమైనంత తక్కువ రోజుల్లోనే సినిమా ను పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్ భావిస్తున్నాడు.

అందుకే పవన్ కి సమయం ఉన్నప్పుడల్లా సన్నివేశాలను చిత్రీకరించుకోవాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.అందుకే ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తయిందని, ఆ చిన్న షెడ్యూల్ ల్లో సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగిందని చెప్తున్నారు.ఈ నెల లాస్ట్ లో మరో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నారు.
మొత్తానికి సమ్మర్ వరకు పవన్ కళ్యాణ్ మరియు సాహో సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.ఇదే సంవత్సరంలోనే ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా కంటే ముందే ఈ సినిమా విడుదలైనా ఆశ్చర్యం లేదు.







