టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్.
మొదటి సినిమాలో తన అందాల ఆరబోతతో యూత్ ని కట్టిపడేసింది.కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఇకపోతే ఈమె తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది.తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్.

ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈమె తరచూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో మిర్రర్ సెల్ఫీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.మిర్రర్ ముందు నిలబడి తన థైస్ అందాలను చూపిస్తూ మత్తెక్కించే చూపులతో సెల్ఫీలు దిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.







