పిట్ట కొంచెం కూత విమానం అని ఇపుడు అనాలేమో మరి.అవును, ఇక్కడ ఓ 3 ఏళ్ల బాలుడి ఉత్సాహం చూశారంటే మీరే చెబుతారు.
మనం ఎక్కడ చిన్న పిల్లల్ని చూసినా వారు చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటూ వుంటారు.బొమ్మ కార్లు, బొమ్మ బైకు… కాస్త పెరిగాక చిన్న చిన్న సైకిల్ తొక్కుతారు.
కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ మూడేళ్ల చిన్నోడు ఏకంగా ఫెరారీ కారును నడిపి అందరినీ తెగ విస్మయానికి గురి చేస్తున్నాడు.అదేంటి అంత ఖరీదైన కారును ఆ బుల్లి బుడ్డొడు నడపడం ఏమిటి? అని షాక్ తిన్నారా?
అయితే మీరు వెంటనే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని పరిశీలించాల్సిందే.ఇది నిజం… టర్కీకి చెందిన జైన్ సోఫుగ్లు అనే చిన్న పిల్లవాడు ఫెరారీ SF90 S స్ట్రాడేల్ స్పోర్ట్స్ కారును నడపడం ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు.ఈ మూడేళ్ల బాలుడు 769-hp ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్పోర్ట్స్ కారును నడుపుతున్నాడు.భారతదేశంలో ఫెరారీ SF90 స్ట్రాడేల్ ధర రూ.7.50 కోట్లు పైనే ధర పలుకుతుంది.V8 ఇంజన్ కలిగిన ఈ కారు 2.5 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు.ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇకపోతే… కార్లపై ఎంత ఆసక్తి ఉన్నా, మన ఇండియాలో పిల్లలు 16 నుండి 18 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు డ్రైవింగ్ మాట ఎత్తరు.ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు.ఇక్కడ కనీస డ్రైవింగ్ వయస్సు 18 సంవత్సరాలు.అందుకనే మనవాళ్ళు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు… ఈ బుడ్డోడు పవర్-ప్యాక్డ్ స్పోర్ట్స్ కారును నడపడంతో పాటు, జైన్ గేర్‌లెస్ ద్విచక్ర వాహనాలు, ATVలు, స్టీమర్‌లు మరియు అనేక ఇతర వాహనాలను కూడా ఇట్టే నడిపేస్తున్నాడు.కాగా ఇంత అద్భుతమైన ప్రతిభ ఈ చిన్న డ్రైవర్ ఎవరో తెలుసా? జైన్ సోఫుగ్లు మోటార్ సైకిల్ సూపర్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు విజేత అయిన కెనన్ సోఫుగ్లు కుమారుడు మరి.







